Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టింటి నుంచి ఎంత రమ్మన్నా రాని భార్య, కిరోసిన్‌తో నిప్పంటించుకుని పట్టుకున్నాడు

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (11:51 IST)
మనస్పర్థల కారణంగా పుట్టింటికి వెళ్లి తిరిగి రాని భార్యను అగ్నికి ఆహుతి చేసాడు ఓ భర్త. ఈ ఘటన సోమవారం రాత్రి 11 సమయంలో జరిగింది.
 
పూర్తి వివరాలను చూస్తే... కరీమాబాద్ 23వ డివిజన్లో ఎస్ఆర్ఆర్ తోటకు చెంది భాస్కర్ ఆటోడ్రైవరుగా జీవిస్తున్నాడు. ఇతడికి భార్య విజయ, 13 ఏళ్ల కుమారుడు వున్నారు. ఐతే ఈమధ్య తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి తారాస్థాయికి చేరడంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది భార్య.
 
ఆ తర్వాత కొన్నిరోజుల తర్వాత భాస్కర్ తన భార్యను తనతో పంపాలని ఊరి పెద్దలను ఆశ్రయించాడు. ఐతే భాస్కర్ భార్య మాత్రం తను భర్తతో వెళ్లేందుకు ససేమిరా అంగీకరించలేదు. దీనితో చేసేది లేక పెద్దలు ఎవరికివారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
ఈ క్రమంలో సోమవారం నాడు తన కుమారుడు పుట్టిరోజు సందర్భంగా విజయ కేక్ కట్ చేస్తూ సంబరాలు చేస్తోంది. భాస్కర్ అక్కడి వచ్చి ఆమెతో మాట కలిపేందుకు ప్రయత్నించాడు. ఆమె అతడితో మాట్లాడేందుకు నిరాకరించింది. దీనితో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన భాస్కర్ తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
 
మంటలతో పరుగెత్తుకుంటూ వచ్చి భార్య విజయను గట్టిగా పట్టుకున్నాడు. మరో మహిళ వారించేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా పట్టుకోబోవడంతో ఆమె తప్పించుకుని పరుగులు తీసింది. మంటలు చెలరేగడంతో ఇద్దరూ ఆర్తనాదాలు చేస్తూ అక్కడికక్కడే మంటల్లో కాలి ప్రాణాలు విడిచారు. కుమారుడి జన్మదిన వేడుకల చేసుకుంటున్న తల్లిని దారుణంగా చంపడమే కాకుండా అతడూ చనిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments