తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన చిరంజీవి... కాంగ్రెస్‌తో కటీఫేనా?

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (19:32 IST)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ. డిసెంబరు నెలలో జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో అటు మహాకూటమి, ఇటు తెరాస నువ్వానేనా అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇదిలావుంటే... తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పొగడ్తల జల్లు కురిపించడంతో కాంగ్రెస్ కంగుతిన్నంత పనైంది.
 
ఇంతకీ మెగాస్టార్ చిరు ఏమన్నారంటే... హైదరాబాదులోని సినీ పరిశ్రమ అన్ని హంగులతో, పరిపూర్ణంగా ఉందంటే దీని వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఎంతో ఉందని అన్నారు. అంతటితో ఊరుకోకుండా దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంపీకయ్యారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన విషయం నిజమేనంటూ కితాబిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల ముఖ్యమంత్రి కాదనీ, ఆయన చేతల ముఖ్యమంత్రి అంటూ కొనియాడారు. 
 
సినీ ఇండస్ట్రీ కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందనీ, ఇంకా తమకు తట్టనివి ఏమయినా వుంటే తనకు చెప్పాలని సీఎం కేసీఆర్ తనతో చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు. ఆయనకు సినీ ఇండస్ట్రీపై వున్న మక్కువ ఎంతటిదో దీన్నిబట్టి ఇట్టే అర్థమవుతుందన్నారు. సంతోషం అవార్డు ఫంక్షనులో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments