Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయ్: ఐఎండీహెచ్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:19 IST)
తెలంగాణలో వారం రోజులుగా చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు-నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. 
 
సోమవారం తెల్లవారుజామున నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సెరిలింగంపల్లిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
 
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) అంచనా ప్రకారం, ఎల్‌బి నగర్, కార్వాన్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, సరూర్‌నగర్‌తో సహా వివిధ ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో రాత్రి ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ నుండి 14 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
 
పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. IMD-H ప్రకారం, రాబోయే ఒక వారం పాటు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
 
తెలంగాణలోని ఇతర జిల్లాలు, ప్రత్యేకించి ఉత్తరాది జిల్లాలు రానున్న వారంలో వేడి రాత్రులను చూడవచ్చు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరగవచ్చని IMD-H తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments