Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ కాంగ్రెస్ ఓటమికి ప్రజలే బాధ్యులు... జానారెడ్డి వింత వాదన

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (14:10 IST)
వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూడటంపై ఆ పార్టీకి చెందిన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జానారెడ్డి వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రజలే బాధ్యులని చెప్పుకొచ్చారు. తెరాస ఏం చేసినా ఆ పార్టీకే పట్టం కడుతుంటే ఏం చేస్తాం... 16 నెలల కాలంలో తెరాస చేసిన తప్పులను ఎత్తిచూపినా వాటిని ప్రజలు పట్టించుకోవడంలేదనీ, కాబట్టి తమ ఓటమికి ప్రజలే బాధ్యత వహించాలన్నారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే తననే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయరాదని ముఖ్యమంత్రి సూచించడం మంచి శకునమని చెప్పిన జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఒకింత నిరాశ చెందారు. మరోవైపు టిపిసీసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పరాజయంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర్నుంచి ఆయన మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఎంతచేసినా ప్రజలు తెరాసకే ఓటు వేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments