Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీ ఆరగించిన యువకుడికి రక్తపు వాంతులు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:16 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్‌లోని ఓ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ ఆరగించిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్న‌రావుపేట మండ‌ల ప‌రిధిలోని బోడ తండా వాసి ప్ర‌సాద్(23) అనే యువకుడు అదే ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, చికెన్ బిర్యానీ ఆర్డరిచ్చి దాన్ని పుష్టిగా ఆరగించాడు. 
 
అయితే రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే అతనికి వాంతులతో పాటు ర‌క్తం కూడా నోట్లో నుంచి ప‌డ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తించిన‌ స్థానికులు పోలీసుల‌కు ఫోన్ చేశారు. పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని వెంట‌నే ప్ర‌సాద్‌ను క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే ప్ర‌సాద్ మృతి చెందిన‌ట్లు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు. మున్సిపల్ అధికారులు రెస్టారెంటుకు చేరుకుని అక్క‌డి ఫుడ్ శాంపిల్స్‌ను సేక‌రించి ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌సాద్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న మృతికి గ‌ల కార‌ణాలు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments