Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపింజరను తాకి కూడా ప్రాణం దక్కించుకుంది. ఆ పాప ఎంత అదృష్టవంతురాలో!

ఆ పాము బుస వింటేనే జనాలకు పైప్రాణం పైనే పోతుంది. ఇక పొరపాటున దాని బారిన పడి కాటుకు గురయ్యామంటే ప్రపంచంలో ఏ ఆసుపత్రికూడా వారిని కాపాడలేదు. నిమిషాల్లో ప్రాణంతీసే ప్రమాదకరమైన విషం దాని సొత్తు. దారిన పోతుంటే కనిపించి దాన్ని కొట్టాలనుకునే లోపే మనిషికి పైక

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (04:04 IST)
ఆ పాము బుస వింటేనే జనాలకు పైప్రాణం పైనే పోతుంది. ఇక పొరపాటున దాని బారిన పడి కాటుకు గురయ్యామంటే ప్రపంచంలో ఏ ఆసుపత్రికూడా వారిని కాపాడలేదు. నిమిషాల్లో ప్రాణంతీసే ప్రమాదకరమైన విషం దాని సొత్తు. దారిన పోతుంటే కనిపించి దాన్ని కొట్టాలనుకునే లోపే మనిషికి పైకి ఎగిరే దాన్ని లంఘనం చూసి మరోసారి దాని జోలికి పోరు. చివరకు నాగుబాము కాటుకు కూడా సకాలంలో ఆసుపత్రికి చేరిస్తే ప్రాణం దక్కించుకోవచ్చేమో కానీ ఈ పాము కాటునుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాంటి స్కూలు బ్యాగులో చేరిన ఆ పామును తాకి కూడా ప్రాణాలు నిలుపుకున్న ఆ చిన్నారని చూసి ఏమదృష్టం అని పొగుడుతున్నారు. 
 
వింటూనే ఒళ్లు జలదరించే ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. కోమటిపల్లి శివారు చంద్రుతండాకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని అజ్మీరా అఖిల కోమటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. స్కూల్లోకి వెళ్లాక బ్యాగు నుంచి పుస్తకం తీయడానికి చేయి పెట్టింది. 
 
చేతికి మెత్తగా తాకినట్లుగా అనిపించడంతో బ్యాగ్‌ను పూర్తిగా తెరిచేసరికి లోపల పాము కనిపించింది. ఆమె ఒక్కసారిగా అరుస్తూ క్లాస్‌ టీచర్‌ క్రిష్ణయ్య వద్దకు పరుగెత్తింది.  ఆ క్లాస్‌టీచర్, హెచ్‌ఎం సోమిరెడ్డి కలసి క్లాసులో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించారు. వెంటనే దాన్ని కర్రతో కొట్టి చంపేయడంతో ప్రమాదం తప్పింది.
 
ఇంతకూ ఆ విద్యార్థిని తెచ్చుకున్న పుస్తకాల సంచిలో ఏ పాము ఉందో తెలుసా.. రక్తపింజర. కాటేసిన మరుక్షణం నుంచి శరీరంలోని చర్మరంధ్రాల నుంచి రక్తం కారి మనుషులు అమాంతంగా చనిపోతారని పల్లెల్లో వణికి చస్తారు. అలాంటి భయంకరమైన విషపామును చేత్తో తాకి కూడా ఆ పాప ప్రాణం నిలుపుకుందంటే మహాదృష్టమే కదా.
 

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments