Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లాడ్జిలో కోరిక తీర్చుకుని ఆ తరువాత..?

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (22:45 IST)
రైలులో పరిచయమైన యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాదులో  సంఘటన జరిగింది. నిందితుడితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
మహారాష్ట్రకు చెందిన ఒక యువతి హైదరాబాద్ లోని గోపాలపురంలో నివాసముంటోంది. ఉద్యోగం వెతుకులాటలో ఉంది. గత వారంరోజుల క్రితం మహారాష్ట్రలోని తన స్వంత గ్రామానికి వెళ్ళి తిరిగి హైదరాబాదుకు రైలులో వెళుతోంది. రైలులో ఒక యువకుడు పరిచయమయ్యాడు. అతని పేరు వివేకానంద. రియల్ ఎస్టేట్ వ్యాపారం.
 
యువతితో పరిచయం పెంచుకున్నాడు. తనకు తెలిసిన స్నేహితులు చాలామంది ఉన్నారని.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇలా వారంరోజుల పాటు ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నారు. నిన్న రాత్రి యువతిని గోపాలపురం సమీపంలోని ఒక లాడ్జీకి రమ్మన్నాడు. అక్కడ తన స్నేహితుడిని తీసుకువస్తానని.. అతను సాఫ్ట్వేర్ కంపెనీ సిఈఓ అని నమ్మించాడు. 
 
ఆ లాడ్జికి వచ్చిన యువతికి తన స్నేహితుడిని పరిచయం చేశాడు. కూల్ డ్రింక్‌లో అప్పటికే మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఇది తెలియని యువతి సేవించింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వివేకానందతో పాటు తన స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. మెళుకువలోకి వచ్చిన యువతి 100కి ఫోన్ చేసింది. పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments