టైమ్‌కు రావాలన్న హెచ్ఎం.. భర్తతో చితకబాదించిన లేడీ టీచర్

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (11:58 IST)
తెలంగాణాలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. స్కూల్‌కు కరెస్ట్ టైమ్ రావాలంటూ ఆ పాఠశాలలో పని చేసే లేడీ టీచర్‌ను ప్రధానోపాధ్యాయురాలు ఆదేశించింది. దీంతో ఆగ్రహించిన ఆ లేడీ టీచర్ తన భర్తతో హెచ్ఎంను చితకబాదించింది. నల్గొండ జిల్లా దాచేపల్లిలో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దాచేపల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రజనీ అనే ఉపాధ్యాయురాలు సమయపాలన పాటించడం లేదు. పాఠశాలకు కరెక్ట్ సమయానికి రావడం లేదని వాడపల్లి  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పులగం రాధిక గుర్తించి, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ విషయం తెలుసుకున్న రజని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై ఫిర్యాదు చేసిన రాధికపై కసి తీర్చుకోవాలనుకున్నారు. మల్కాపట్నం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న తన భర్త శ్రీనివాస రెడ్డికి విషయం చెప్పి రాధికపై దాడి చేయాలని ఉసిగొల్పింది. 
 
దీంతో పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాల ఉపాధ్యాయుడు దీపాల కృష్ణ ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు రాధిక దంపతులు ఈ నెల 19న వాహనంపై వస్తుండగా మిర్యాలగూడకు చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో రామాపురం అడ్డరోడ్డు వద్ద వారిపై దాడి చేశారు.
 
ఆ తర్వాత వారి వద్దనున్న ఐదు సవర్ల బంగారం తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీనివాసరెడ్డి, రజనిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు నిన్న నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు

manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్

Mega brothers: మెగా బ్రదర్స్ కలయికగా చిరంజీవి మెగా158 సినిమా ప్రారంభోత్సవం

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

తర్వాతి కథనం
Show comments