Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో పెను విషాదం - సిలిండర్ పేలి ఇద్దరి మృతి

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (16:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఏసీ సిలిండర్ పేలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న న్యూస్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీ ఏసీ గ్యాస్‌ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో సిలిండర్ ఉన్నట్టుండి పేలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజీ ఓనర్ షేక్ కలీం, అందులో పని చేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్‌స్టోరేజ్ పని చేస్తున్న మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments