Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటివద్దనే బస్‌పాస్‌లు.. బస్టాండ్ల వద్దకు రావాల్సిన అవసరం లేదు..

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (08:37 IST)
TSRTC
హైదరాబాద్ మహానగరంలో విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం లక్షలాదిమంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి వివిధ కేటగిరీల రాయితీలపై టీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌లు ఇస్తోంది. గ్రేటర్‌ పరిధిలో ఇలా బస్‌పాస్‌లు తీసుకునేవారు 9 నుంచి 10 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో స్టూడెంట్‌ పాస్‌లు, ఉద్యోగస్తుల నెలవారీ పాసులే అధికం. బస్‌పాస్‌ల ద్వారే ఆర్టీసీకి నిత్యం రూ.80 లక్షల వరకు ఆదాయం సమకూరేది. 
 
ప్రస్తుతం కోవిడ్‌ నేపథ్యం, విద్యాలయాలు మూతబడడం, ఇంటి నుంచే చాలామంది ఉద్యోగాలు చేస్తుండడంతో బస్‌పాస్‌లు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడుతున్నది. గ్రేటర్‌ పరిధిలో ఆక్యుపెన్సీ రేషియో మొన్నటివరకు 50శాతం ఉండగా, క్రమంగా పుంజుకుంటుంది.
 
బస్‌పాస్‌ రెన్యువల్‌కు ప్రతినెలా బస్టాండ్‌లోని కౌంటర్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రద్దీ ఉంటే నిరీక్షణ తప్పదు. కొత్తపాస్‌ తీసుకోవాలనుకున్నా ప్రత్యేకంగా కౌంటర్‌ వద్దకు వెళ్లాల్సిందే. ఈ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తాజాగా టీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌ వినియోగదారుల కోసం కొత్త అవకాశాన్ని కల్పించింది. 
 
కొత్తగా బస్‌పాస్‌ తీసుకునేందుకు, పాత్‌ పాస్‌ల రెన్యువల్‌ కోసం బస్టాండ్ల వద్దకు రాకుండా వినియోదారుల వద్దకే వెళ్లి రెన్యువల్‌ చేసేలా చర్యలు చేపట్టింది. కొత్తగా బస్‌పాస్‌ తీసుకునేవారు, రెన్యువల్‌ చేసుకునే వారు ఒకే ప్రాంతంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నేరుగా వారి వద్దకే సిబ్బంది వచ్చి పాస్‌లు జారీ చేస్తారు. ఈ సేవలను వినియోగించుకోవాలంటే 8008204216 నంబర్‌ను సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం