Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ టికెట్‌తో సులభంగా శ్రీవారి దర్శనం

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (11:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో నడిపేవారు తిరుమల శ్రీవారిని సులభంగా, శీఘ్రంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని ఆ సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సులు నడుపుతోందని, ప్రతి రోజు వెయ్యి మంది ప్రయాణికులకు రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. దీన్ని భక్తులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
 
ఈ నెల 18 వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన 1,14,565 మంది ప్రయాణికులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించిందని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ, సాధారణంగా వెళ్లేవారికి దర్శనానికి పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లాలని, తద్వారా శ్రీవారి దర్శనం త్వరగా అవుతుందని సూచించారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌ ద్వారా రూ.300 టికెట్‌తో దర్శనం చేసుకోవాలంటే నెలరోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోందని, అదే టీఎస్‌ఆర్టీసీ ద్వారా అయితే వారం రోజులు చాలని బాజిరెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన బస్సుల్ని తిరుపతికి నడిపిస్తున్నట్లు వివరించారు. తిరుమల వెళ్లే భక్తులు మరిన్ని వివరాలకు టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ www.tsrtconline.in చూడాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments