Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఎంసెంట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (18:27 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణాలో ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభంకానుంది. ఇందుకోసం శుక్రవారం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. 
 
ఈ షెడ్యూల్ ప్రకారం తొలి దశలో అభ్యర్థులకు కేటాయించిన చేసిన సీట్లు రద్దు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 28గా నిర్ణయించారు. అలాగే, ఆన్‌లైన్‌లో అభ్యర్థుల దరఖాస్తు, ఫీజు చెల్లింపులు 25, 26వ తేదీల్లో జరగనున్నాయి. తుది దశలో స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27న జరుగుతుంది. 
 
ట్యూషన్ ఫీజు చెల్లింపు, వ్యక్తిగత రిపోర్టింగ్‌ను నవంబరు 2 నుంచి 5వ తేదీలోపు పూర్తి చేయాలి. కేటాయించిన కాలేజీల్లో నవంబరు 2 నుంచి 6వ తేదీలోపు రిపోర్ట్ చేయాలి. చివరి ఫేజ్‌లో కేటాయించిన సీటు క్యాన్సిల్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు నవంబరు 7లోపు ఈ ప్రక్రియ పూర్తిచేసుకోవాలి.
 
స్పెషల్ రౌండ్‌ కౌన్సిలింగ్ అభ్యర్థులు తమ సీటు క్యాన్సిల్ చేసుకోవడానికి నవంబరు 15 వరకూ అవకాశం ఉంది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ ఇంజినీరింగ్, బీఫార్మసీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలను నవంబరు 14న తేదీన వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments