Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కేటీఆర్ ఔదార్యం.. క్షతగాత్రులను తన కార్లలో తరలించారు...

Webdunia
గురువారం, 29 జులై 2021 (18:28 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోమారు పెద్ద మనసు చూపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడివున్న క్షతగాత్రులను తన కాన్వాయ్‌లోని రెండు కార్లలో ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటన సిద్ధిపేట ఔటర్ బైపాస్‌పై వైద్య కాలేజీ వద్ద జరిగింది. 
 
సిద్ధిపేట ఔటర్ బైపాస్‌లో మెడికల్ కాలేజీ దగ్గరలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తుల ప్రమాదానికి గురయ్యారు. వీరి బైక్ డివైడర్‌కు ఢీ కొట్టి, తీవ్రంగా గాయపడ్డారు. సిద్ధిపేటకు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులుగా గుర్తించారు. 
 
అయితే ఆ సమయంలో సిరిసిల్ల పర్యటన ముగించుకున్న కేటీఆర్ అదేమార్గంలో వెళుతున్నారు. అపుడు ప్రమాదాన్ని చూసి చలించిపోయిన మంత్రి కేటీఆర్‌… వెంటనే తన కాన్వాయ్‌లోని 2 కార్లల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
ఆ బాధితులకు అండగా తన పీఏతో పాటు ఎస్కార్ట్ పోలీసులను పంపించారు. ఆ తర్వాత క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోనులో ఆదేశించారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ చూపిన చొరవపై… బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments