ఫెయిలయ్యామని కొందరు.. తక్కువ మార్కులు వచ్చాయని ఇంకొందరు... ఆత్మహత్యలు

Webdunia
బుధవారం, 10 మే 2023 (09:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కొందరు విద్యార్థులు ఫెయిల్ కాగా, మరికొందరు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ఇలాంటి వారిలో కొందరు తీవ్ర మనస్తాపానికిలోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా ఇప్పటివరకు ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని తన తల్లిదండ్రులకు కడపుకోత మిగిల్చారు. 
 
పటాన్‌చెరులో ఇంటర్ ఎంపీసీ చదువుతునున్న తిరుపతికి చెందిన విద్యార్థి ఫెయిల్ అవుతామన్న మనస్తాపంతో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. మంగళవారం ఉదయం గుండ్లపోచంపల్లి - మేడ్చల్ రైల్వే స్టేషన్‌ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో చదువుకుంటున్న గద్వాలకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఉరేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో ఉంటూ ఇంటర్ చదువుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థిని ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
సికింద్రాబాద్‌లో ఒకరు, ఖైరతాబాద్‌లో మరొకరు ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకోగా, నారాయణపేట జిల్లా కొత్తకోటకు చెందిన అమ్మాయికి మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అలాగే, పటాన్‌చెరు సమీపంలోని పాటి గ్రామానికి చెందిన భవానీ అనే మరో విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయి తీవ్ర మనస్తాపంతో కనిపించకుండా పోయింది. 
 
జగిత్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్న ఆర్మూర్ విద్యార్థి కూడా మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments