తెలంగాణలో కొత్త ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వెల్లడి

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (13:16 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. జేఈఈ మెయిన్స్ ఎంట్రెన్స్ 2022 తేదీల్లో మార్పులు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో కూడా ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ మార్పులు చేసిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించారు. 
 
ఇందులోభాగంగా, ఏప్రిల్ 22వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలను మే 6వ తేదీ నుంచి ప్రారంభించాలన్న నిర్ణయించారు. దీంతో తెలంగాణాలో మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సవరించిన ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను ఆ రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. 
 
ఈ పరీక్షలను మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనుండగా, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో ఇంటర్ బోర్డు తెలిపింది. మారిన ఇంటర్ షెడ్యూల్ ప్రకారం... 
 
మే 6న సెకండ్ లాంగ్వేజ్, 9న ఇంగ్లీష్, 11న మ్యాథ్స్, వృక్షశాస్త్రం, పొలిటికల్ సైన్స్, 13న మ్యాథ్య్-2, జువాలజీ, హిస్టరీ, 16న ఫిజిక్స్, ఎకనామిక్స్, 18న కెమిస్ట్రీ, కామర్స్, 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు, మ్యాథ్స్ పేపర్-1, 23న మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి. 
 
ద్వితీయ సంవత్సర షెడ్యూల్‌ను పరిశీలిస్తే, మే 7న సెకండ్ లాంగ్వేజ్, 10న ఇంగ్లీష్, 12న మ్యాథ్స్ -2ఏ, వృక్షశాస్త్రం, పొలిటకల్ సైన్స్, 14న మ్యాథ్స్-బి, జువాలజీ, హిస్టరీ, 17న ఫిజిక్స్, ఎకనామిక్స్, 19న కెమిస్ట్రీ, కామర్స్, 21న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు, మ్యాథ్స్ పేపర్-2, 24న లాంగ్వేజెస్, జియోగ్రఫీ పరీక్షలను నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments