Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి ఎంసెట్ - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Webdunia
సోమవారం, 18 జులై 2022 (12:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ అర్హత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో జరిగే ఈ పరీక్షలు ప్రతి రోజూ రెండు సెషన్స్‌లలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు నియమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అలాగే,  పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని చెప్పారు. అందువల్ల విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
 
మొత్తం మూడు రోజుల పాటుసాగే ఈ పరీక్షలకు 1,72,241 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్థన్ తెలిపారు. ఇందులో తెలంగాణాలో 89, ఏపీలో 19 చొప్పున ఉన్నాయన్నారు. 
 
విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్, గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. కాగా, ఈ నెల 14, 15వ తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ విభాగం అర్హత పరీక్షలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments