Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని ఆంధ్రోళ్ల ఇళ్ళకు నీరు - విద్యుత్ బంద్ చేస్తాం : తెరాస

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (10:59 IST)
హైదరాబాద్‌లో నివశిస్తున్న ఆంధ్రోళ్ల నివాసాలకు నీరు, విద్యుత్ సరఫరా బంద్ చేయాలంటూ పలువురు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై వారు మంగళవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. 
 
ఇందులో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సునీతతో పాటు ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వారు చంద్రబాబునాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ విషయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. 
 
అందువల్ల హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి ఇళ్లకు, కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేసేందుకు వెనుకాడమని వారు హెచ్చరించారు. ఓ వైపు తెలంగాణ రాష్ట్రానికి సాయం చేస్తానంటూనే, మరో వైపు తెలంగాణకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వారు ధ్వజమెత్తారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments