Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో రికార్డు: మెజారిటీల టాప్ టెన్‌లో దయాకర్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (09:29 IST)
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలు పలు రికార్డులతో అదరగొట్టింది. ఏకపక్షంగా సాగిన పోలింగ్‌లో గులాబీ పార్టీ విజయం సాధించింది. వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4.59 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దేశంలో నమోదైన రికార్డు మెజారిటీల టాప్ టెన్ జాబితాలోకీ దయాకర్ గెలుపు నమోదైంది.

అయితే ఉప ఎన్నికల బరిలోకి దిగిన ఏ ఒక్క అభ్యర్థి కూడా తమకు సమ్మతం కాదంటూ ఏకంగా 7,753 మంది ఓటర్లు తమ నిరసనను ‘నోటా’ రూపంలో వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా తెగులు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ‘నోటా’కు ఓట్లు పోల్ కావడం ఇదే తొలిసారి అని దయాకర్ వ్యాఖ్యానించారు.
 
ఇదిలా ఉంటే.. వరంగల్ ఉప ఎన్నిక విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజలు ఆమోదం తెలిపారని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లోనే కాదు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరి పోరు చేస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అర్హులైన బీసీలకు త్వరలో కల్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు త్వరలో తీపి కబురు చెబుతామని, 2021 నాటికి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని, కళాశాల, యూనివర్శిటీ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments