Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కుమార్తె కె కవితకు ఆహ్వానం!

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (16:08 IST)
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలంటూ టీఆర్ఎస్‌కు చెందిన నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె కవితకు ఆహ్వానం అందింది. దాంతో ఆమె శనివారం ఉదయం చెన్నై వెళ్లనున్నారు. కాగా, అన్నాడీఎంకే శాసనసభా నాయకురాలిగా జయలలిత ఎన్నికైన వెంటనే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆమెకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.
 
 
మరోవైపు రేపటి జయ ప్రమాణ స్వీకారోత్సవానికి చెన్నైలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యను కలసిన జయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఆమె గవర్నర్‌కు అందజేశారు.
 
అంతకుముందు శుక్రవారం ఉదయం 7 గంటలకు సమావేశమైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జయలలితను ఏకగ్రీవంగా శాసనసభా నాయకురాలిగా ఎన్నుకున్న విషయం తెల్సిందే. ఆ వెనువెంటనే ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాపై గవర్నర్ కె రోశయ్య ఆమోదముద్ర వేసి... జయలలితను ప్రభుత్వ ఏర్పాటుకు ఏహ్వానించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments