Webdunia - Bharat's app for daily news and videos

Install App

61 ఏళ్ల వ‌య‌సులో ఎమ్మెల్సీ నార‌దాసు పెళ్ళి కొడుకాయెనే

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఓ ఇంటివారు కాబోతున్నారు. 61 ఏళ్ళ వ‌య‌సున్న ఆయ‌న, 41 ఏళ్ల వయసున్న వర్ష అనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నార‌దాసు విప్లవోద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పీపుల్స్ వార్ ఉద్

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (14:29 IST)
హైద‌రాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఓ ఇంటివారు కాబోతున్నారు. 61 ఏళ్ళ వ‌య‌సున్న ఆయ‌న, 41 ఏళ్ల వయసున్న వర్ష అనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నార‌దాసు విప్లవోద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పీపుల్స్ వార్ ఉద్యమంలో ప‌నిచేసి, మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఉద్యమం నుంచి బయటకు వచ్చి న్యాయవాదిగా పని చేసి, చివ‌రికి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు. 
 
తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డ‌గానే, కేసీఆర్ నార‌దాసుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి గెలిపించారు. తాజాగా స్థానిక సంస్థల కోటాలో మరోసారి ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు. ఇలా విప్ల‌వోద్య‌మం, రాజ‌కీయంలో ప‌డి నార‌దాసు ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇంట్లో వదిన ఆయన్ను తల్లిలా చూసుకుంది. అయితే అనారోగ్యంతో ఆమె గతేడాది కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఓ తోడు ఉంటే బాగుంటుందని భావించిన నారదాసుకు పెళ్లి ఆలోచ‌న క‌లిగింది. 
 
హైదరాబాద్‌కు చెందిన 41 ఏళ్ల వర్ష పరిచయం కావ‌డం, ఒక‌రికొక‌రు ఇష్టపడడంతో ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారు. త్వ‌ర‌లో వీరిద్ద‌రూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గ‌త అక్టోబరు నెలలో రిజిస్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ, కరీంనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో నారదాసు పెళ్లి ప్రకటన అతికించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments