Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసిన తెరాస ఎమ్మెల్సీ కవిత

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (14:38 IST)
ఇటీవల ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో తన పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలపై తెరాస ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా కోర్టుల్లో ఆమె ఈ పరువు నష్టం దావా పిటిషన్లను దాఖలు చేశారు. 
 
తన తండ్రిని బద్నాం చేయడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందార్ సింగ్‌లు సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై చేసిన ఆరోపణలు సంచలనమై చర్చనీయాంశంగా మారాయి. 
 
వీటిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తన తండ్రి కేసీఆర్‌ను బద్నాం చేయడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వీరిపై పరువునష్టం దావా వేస్తానని నిన్న ప్రకటించారు. 
 
చెప్పిన విధంగానే వీరిపై ఆమె పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టులలో ఆమె పరువునష్టం దావా వేశారు. మరోవైపు సోమవారం కవిత ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టిన 29 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ నరేందర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments