Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలు కూల్చేస్తాం : తెరాస ఎమ్మెల్యే

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2015 (09:24 IST)
పాఠ్యపుస్తకాల నుంచి తెలంగాణ చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఇదే అంశంపై పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో మార్పులను సూచిస్తూ జారీ అయిన జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఏపీ జారీ చేసిన సర్క్యులర్‌పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోని పక్షంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర అవసరం లేదని అనడం సరికాదని ఆయన సూచించారు. తొలగించిన పాఠ్యాంశాలన్నీ ఏపీ సిలబస్‌లో చేర్చాలని ఆయన స్పష్టం చేశారు. 
 
లేనిపక్షంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న సీమాంధ్రుల చరిత్రకారులకు చెందిన విగ్రహాలతో పాటు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీమాంధ్రుల పేర్లను తొలగిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments