Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లు చేతులు విరగ్గొట్టేస్తాం : తెరాస ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:54 IST)
తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న బహింగ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్‌ రెడ్డి అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే కాళ్లు, చేతులు నరికి పంపిస్తామని జోగురామన్న హెచ్చరించారు. 
 
ఇటీవల ఇంద్రవల్లి దళిత దండోరా సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభపై జోగు రామన్న మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా ఇంద్రవెల్లి సభ జరిగిందన్నారు. 
 
ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పగటి దొంగ రేవంత్‌కు తగిన శాస్తి జరిగే రోజు ముందే ఉందని జోగురామన్న ఆరోపించారు.
 
దళిత, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. నాగోబా జాతరకు నిధులిచ్చి ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు. గతంలో గిరిజన, ఆదివాసీ పండగలను సంస్కృతిని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు వచ్చి గొప్పలు చెప్పుకుంటోందని జోగురామన్న విమర్శించారు. 
 
పోడు భూముల సమస్య పరిష్కారం కరోనా వల్ల కొంత ఆగిందన్నారు. దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని.. త్వరలోనే అవి పరిష్కారమవుతాయి అని తెలిపారు. దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు వెలుగునిచ్చింది, ఇచ్చేది కేసీఆర్ మాత్రమే అని జోగు రామన్న పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments