Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ గొప్పదనం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి మా వద్ద గొప్పలు చెప్పొద్దు... మండిపడ్డ మంత్రి

మోదీ గురించి మాట్లాడాలంటేనే అందరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తున్న పరిస్థితుల్లో తెరాస మంత్రి మాత్ర లెక్కలేనట్లుగా మాట్లాడటం గమనార్హం.

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (05:11 IST)
ఉత్తర భారతదేశంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలను ఎన్నికల్లో ఊచకోత కోసి అందరినీ భీతిల్ల చేసి ఉండొచ్చు కానీ తెలంగాణను మోదీ ఏదో ఉద్ధరిస్తున్నట్లు ఫోజు కొడితే మాత్రం ఊరుకునేది లేదంటూ తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెలరేగిపోయారు. మోదీ గురించి మాట్లాడాలంటేనే అందరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తున్న పరిస్థితుల్లో తెరాస మంత్రి మాత్ర లెక్కలేనట్లుగా మాట్లాడటం గమనార్హం. 
 
ఈ గొడవకు మూలకారణం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఎంవీఎస్ఎస్ ప్రభాకర్. విద్యుత్ పంపిణీలో సంస్కరణలకు నాందిపలికిన కేంద్రం ప్రకటించిన ఉదయ్ పథకంలో తెలంగాణ చేరకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని ప్రభాకర్ విమర్శించారు. దీంతో జగదీష్ రెడ్డికి ఎక్కడ కాలాలో అక్కడ కాలినట్లుంది. ఎన్నాళ్లనుంచి కోపం దాచుకుని ఉన్నారో కానీ లోయర్‌ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంతోపాటు తెలంగాణలోని ఏడు మండలాలను చంద్రబాబుకు మోదీ అప్పగించారని మంత్రి విసురుగా మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా మంత్రి అన్న మాటలు బీజేపీ సభ్యులను బిత్తరపోయేలా చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి కరెంటు ఇస్తే వద్దన్నామా, రూ.10 వేల కోట్లు ఇస్తామంటే వద్దన్నామా, ఎన్టీపీసీ నుంచి విద్యుత్‌ అడిగితే మార్వాడిలా బేరమాడారు. ఉదయ్‌ పథకంలో చేరితే రూ.కోట్లు వస్తాయా, అసలు ఏముంది అందులో.. చిన్న వెసులుబాటు తప్పితే. అదేదో రాష్ట్రానికి మోదీ వేల కోట్లు ఇచ్చినట్లు.. మేము లెక్కపెట్టుకోలేకపోయామన్నట్లు మాట్లాడుతున్నారే.. అంటూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీభత్సంగా ఎద్దేవా చేశారు. 
 
మోదీ గొప్పదనం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి మా వద్ద గొప్పలు చెప్పొద్దు అనే రేంజిలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. దీంతో ఆయన క్షమాపణ చెప్పాలం టూ బీజేపీ పక్ష నేత కిషన్‌రెడ్డి, సభ్యులు లక్ష్మణ్, ప్రభాకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. అప్పటికీ తగ్గని మంత్రి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కోతల్లేవా అని ఎద్దేవా చేశారు. అక్కడ ఆర్నెల్లలో కోతల్లేకుండా చేసి చూపించాలన్నారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళన వీడకపోవడంతో సభ గురువారానికి వాయిదా పడింది.
 
మొత్తం మీద బీజేపీ సభ్యులు తమ వ్యాఖ్యల ద్వారా ప్రధాని పరువును తీసిపారేశారు. ఈ మధ్య కాలంలో మోదీపై ఇంత ఘాటుగా విమర్ళలను ఎవరూ చేయలేదు మరి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments