Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ధాన్యం కొనుగోలుపై తెరాస వాయిదా తీర్మానం

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (10:15 IST)
పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజునే తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీ ధాన్యం కొనుగోలుపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు తెరాస సభ్యులు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయని అందువల్ల రూల్ 267 కింద తక్షణం ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ ఛైర్మన్‌కు తెరాస ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు. 
 
భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల తెలంగాణా రాష్ట్రంలో లక్ష టన్నుల ధాన్యం మార్కెట్ యార్డుల్లో మురిగిపోతుందని ఆయన ఆరోపించారు. పైగా, కేంద్రం కూడా పంట సేకరణపై వివక్షాపూరిత వైఖరిని అవలంభిస్తుందన్నారు. అందువల్ల ధాన్యం సేకరణ అంశంపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments