Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవీపీ ఇంట్లో దొంగలు పడ్డారు.. డైమండ్ నెక్లెస్ మాయం

Webdunia
మంగళవారం, 31 మే 2022 (16:29 IST)
KVP
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో దొంగలు పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా దాదాపు రూ. 46 లక్షలు విలువ గల 49 గ్రాముల డైమండ్ నెక్లెస్ మాయమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
డైమండ్ నెక్లెస్ మాయంపై కేవీపీ భార్య సునీత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 11న సునీత తెలుపు రంగు డైమండ్ నెక్లెస్ ధరించి ఓ ఫంక్షన్‌కు వెళ్ళారు. ఫంక్షన్ నుండి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం బెడ్ రూమ్‌లో నెక్లెస్‌ను పెట్టగా... కొద్దిసేపటికే నెక్లెస్ మాయమవడంతో సునీత ఇళ్లంతా వెతికారు. 
 
డైమండ్ నెక్లెస్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ రెండు రోజుల క్రితం కేవీపీ భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments