Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల్ దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (05:14 IST)
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జోనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు చెరువులో గల్లంతయ్యారు.

ఒకరు క్షేమంగా బయటపడినా... మరొకరి ఆచూకీ లభించలేదు. దసరా పర్వదినాన నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడకు చెందిన ఇద్దరు యువకులు స్థానిక వినాయక సాగర్ చెరువులో దిగి గల్లంతయ్యారు.

గమనించిన స్థానికులు ఒకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో యువకుడు అనిల్ వర్మ(20) చెరువులో మునిగి పోయాడు. స్థానికులు ఎంత వెతికినా దొరకలేదు. స్థానికుల పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

పండగపూట చెరువులో యువకుడు గల్లంతు కావడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు వినాయక సాగర్ వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments