Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారపు వీడియోలతో వలపు వల.. ధనికులు - వ్యాపారులే లక్ష్యంగా...

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (12:41 IST)
ఓ మహిళ శృంగార వీడియోలతో వలపు వల పన్నింది. కేవలం ధనికులు, వ్యాపారస్తులే లక్ష్యంగా ఆమె ఎత్తులు వేసింది. తన వలలో చిక్కుకున్న వారిని నయానోభయానో బెదిరించి లక్షలాది రూపాయలు గుంజసాగింది. ఇలా ఆమె చేతిలో మోసపోయిన ఓ బడా వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ బండారం మొత్తం బట్టబయలైంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాల్వంచ పట్టణంలోని టీచర్స్‌కు కాలనీకి చెందిన ఓ మహిళ ముందుగా ఆర్థికంగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటుంది. ఆ తర్వాత స్నేహం పేరుతో వారికి వలపు వల విసురుతుంది. ఈ వలలో చిక్కుకున్న వారిని శారీరకంగా లొంగదీసుకుని, రహస్యంగా వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత భారీ మొత్తంలో నగదు డిమాండ్‌ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. 
 
ఈ క్రమంలో ఇటీవల శాస్త్రిరోడ్‌కు చెందిన ఓ బడా వ్యాపారిని ఇదే తరహాలో లొంగదీసుకుంది. ఇద్దరు చాటుమాటుగా కలిసిన వీడియో తన వద్ద ఉందని, అందుకు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగింది. పాల్వంచ, ఇల్లెందు పట్టణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం రాయబారం నడపడం గమనార్హం. 
 
దీంతో సదరు వ్యాపారి అంతమొత్తం ఇచ్చుకోలేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారితో డబ్బులు కొంత మొత్తం ఇస్తామని రప్పించి మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
 
అనంతరం ఆమె మొబైల్ ఫోనును పరిశీలించగా, అందులో పలువురి చిత్రాలు, వీడియోలు ఉన్నాయి. దీంతో ఈ ఊబిలో మరికొందరు చిక్కుకున్నారనే విషయం వెలుగు చూసినట్లు సమాచారం. కేటీపీఎస్‌ డీఈ స్థాయి అధికారి, మరో ఫోర్‌మెన్, భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి కూడా వలపు వలలో పడ్డట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments