Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్న హైదరాబాద్ వాసులు

Webdunia
బుధవారం, 18 మే 2022 (11:49 IST)
అన్నీ రంగాల్లో ముందుండే హైదరాబాద్ వాసులు ఆరోగ్య విషయం వెనుకాడుతున్నారు. నగరంలో చాలామంది షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నారు. కేవలం 19 శాతం మంది మాత్రమే బీపీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒకేచోట కూర్చొని పనిచేసే జీవన విధానం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గ్లోబల్‌‌ హాస్పిటల్‌‌, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌‌ కలసి చేసిన స్టడీ రిపోర్ట్‌‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు తాజాగా విడుదల చేశారు.
 
బీపీ, షుగర్‌‌‌‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ప్రాణాంతకంగా మారతాయని ఆయన హెచ్చరించారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలని, వ్యాధి ఉన్నట్టు తేలితే రెగ్యులర్‌‌‌‌గా మందులు వాడాలని సూచించారు. 
 
కరోనాకు ముందు తాము చేసిన స్టడీలో 25 శాతం మందికి మాత్రమే బీపీ ఉండగా, ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోందని సర్వేలో పాల్గొన్న ఓ డాక్టర్ తెలిపారు.
 
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 26 నుంచి 50 ఏళ్ల వయసున్న 9 వేల మందిపై ఈ అధ్యయనం చేశారు. ఇందులో 5 వేల మంది వివరాలను విశ్లేషించి నివేదిక విడుదల చేశారు. 
 
ఈ 5 వేల మందిలో 40.7 శాతం మందికి బీపీ ఉందని, ఇంకో 39.8 శాతం మందికి బీపీ ముప్పు (ప్రీ హైపర్‌‌‌‌ టెన్షన్‌‌) ఉందని గుర్తించారు. కేవలం 19.5 శాతం మందికి బీపీ నార్మల్‌‌గా ఉన్నట్టు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments