Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం అమ్మాయి.. క్రిస్టియన్ కుర్రోడు... హిందూ సంప్రదాయంలో పెళ్ళి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (11:08 IST)
ఇదో వింత పెళ్లి. సాధారణంగా ముస్లిం అమ్మాయిని హిందూ యువకులు లేదా ముస్లిం యువకులు హిందూ అమ్మాయిని, హిందూ, క్రిస్టియన్ యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఓ ముస్లిం అమ్మాయిని ఓ క్రైస్తవ కుర్రోడు వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ పెళ్లి అటు క్రైస్తవ లేదా, ముస్లిం సంప్రదాయంలో కాకుండా హిందూ సంప్రదాయంలో జరగడమే ఇక్క వింత. ఈ వింత పెళ్లి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లాలోని అన్నారుగూడెంలో ఓ క్రైస్తవ అబ్బాయి, ఓ ముస్లిం అమ్మాయి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, తమ పెద్దలకు చెప్పారు. పైగా, భిన్నమతాలకు చెందినవారుకావడంతో తమ పెళ్లి కూడా భిన్నంగా ఉండాలని భావించారు. నిజానికి క్రైస్తవుల పెళ్లి వారి సంప్రదాయం ప్రకారం చర్చిలో జరుగుతుంది. అలాగే, ముస్లింల నిఖా వారి ఆచారం ప్రకారం మసీదులో జరుగుతుంది. 
 
అంతే.. అటు క్రైస్తవ సంప్రదాయంలో కాకుండా, ఇటు ముస్లిం సంప్రదాయంలో కూడా హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణం... సమాజంలో ఇతరులకు ఆదర్శనంగా నిలవడం కోసం వధూవరులు ఈ సంప్రదాయాన్ని ఎంచుకున్నారు. అంతే.. ఆదివారం వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments