Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి: రేవంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై ఓ స్పష్టత వస్తోంది. గతకొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలతో రేవంత్ టచ్‌లో ఉన్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయంతెల్సిందే. ఈ నేపథ

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (08:11 IST)
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై ఓ స్పష్టత వస్తోంది. గతకొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలతో రేవంత్ టచ్‌లో ఉన్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో ఈనెల 17వ తేదీన ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పార్టీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీని కలిశారనే ప్రచారం సాగుతోంది. 
 
అయితే రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్‌ను కలిసినట్లుగా ఎక్కడ చెప్పటం లేదు. కాంగ్రెస్‌లో చేరుతున్నాననే వార్తలపై ఎక్కడా బహిరంగంగా స్పదించనూ లేదు. సన్నిహితులతో మాత్రం పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది. పొత్తులపై అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ పెద్దలతో కలిస్తే తప్పేంటని రేవంత్ తాజాగా ప్రశ్నించారు. 
 
స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకునే అవకాశం తమకు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు ఆయన తన సన్నిహితులకు చెబుతున్నారు. ఇప్పటికే చాలా విషయాల్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేసినట్లు చెబుతున్న రేవంత్.. కలిసి పోరాటం చేసే వాళ్ళతో టీడీపీ పొత్తులు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments