తెలంగాణ టీడీపీ పగ్గాలు బక్కనికి... చంద్రబాబు నిర్ణయం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (15:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి నూతన అధ్యక్షుడుగా బక్కని నరసింహులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తర్వాత బక్కని నరసింహులు మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ  బలోపేతం కోసం‌ కృషి చేస్తానని ప్రకటించారు. 
 
టీడీపీలో మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. 
 
చంద్రబాబు కష్టడి హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేస్తే కేసీఆర్, జగన్‌లు అనుభవిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు పార్టీని వీడినా... తెలంగాణలో పార్టీకి  ప్రజల ఆదరణ ఉందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు. 
 
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.  టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈయన స్థానంలో బక్కని నరసింహులును నియమించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments