Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 8 నుంచి పదో తరగతి పరీక్షలు.. టైమ్ టేబుల్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (17:04 IST)
కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన పదో తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమైంది. ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు, సూచనల మేరకు ఈ పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఇందులోభాగంగా, వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 
 
కరోనా వైరస్‌కు ముందు కేవలం మూడు పరీక్షలు మాత్రమే పూర్తయ్యాయి. మార్చి 19వ తేదీన ఈ పరీక్షలు ప్రారంభంకాగా, ఆ తర్వాత మూడు పరీక్షలు జరిగాయి. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో పరీక్షలను వాయిదావేశారు.
 
ఇపుడు మిగిలిన 8 పరీక్షలకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1, జూన్ 11న ఇంగ్లీష్ పేపర్-2, 14న గణితం పేపర్-1, 17న గణితం పేపర్-2, 20న సైన్స్ పేపర్-1, 23న సైన్స్ పేపర్-2, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 29న సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. 
 
అలాగే, జూలై రెండో తేదీన ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్ (సంస్కృతం అబిక్), జూలై 5వ తేదీన ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ రెండో పేపర్ (సంస్కృతం అబిక్), ఒకేషనల్ కోర్సు థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 వరకు, ఒకేషనల్ థియరీ పేపర్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments