Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానా వానా వల్లప్పా... నైరుతి రాకతో విస్తారంగా వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు గురువారం ప్రవేశించాయి. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (10:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు గురువారం ప్రవేశించాయి. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రుతుపవనాలు విస్తరించటంతో… వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.
 
బుధవారం రాష్ట్రంలోని కొడంగల్‌లో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాచారంలో 4 సెంటీ మీటర్లు, సరూర్ నగర్‌లో 3 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది. మరోవైపు జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాకలో వర్షం పడింది.
 
అటు వరంగల్, కరీంనగర్ జిల్లాలోనూ చిరుజల్లులుల కురిశాయి. మరోవైపు వర్షంతో మార్కెట్లలో పంట తడిసి ముద్దయ్యింది. రాజధాని హైదరాబాద్‌ను తొలకరి పలకరించింది. అర్థరాత్రి మొదలైన వర్షం… తెల్లవారుజాము వరకు దంచికొట్టింది. దాదాపు 4 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 
 
ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సైదాబాద్, తార్నాక, వారాసిగూడ, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, అమీర్ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో పలుచోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments