తెరాసకు షాకిచ్చిన ఎస్ఈసీ : హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీకి బ్రేక్!

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (16:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారికి వరద సాయం పంపిణీ చేసేందుకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి రావడంతో వరద సాయం పంపిణీతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ సెక్రటరీ ఎం.అశోక్ కుమార్‌‌ ఉత్తర్వులను జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వరద సాయాన్ని ఆపేయాలని, ఎన్నికల తర్వాత యధావిధిగా వరద సాయాన్ని కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో వరద సాయానికి బ్రేక్ పడినట్లైంది. 
 
కాగా, ఇటీవల గత వందేళ్లలో ఎన్నడూలేని విధంగా భారీ వరదలు నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. నగరంలో కురిసిన భారీ వర్షానికి నగర వాసులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కాలనీలన్నీ మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. దీన్ని గమనంలోకి తీసుకున్న కేసీఆర్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ సహాయంగా బాధితులకు పది వేల రూపాయల చొప్పున అందించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఇందుకోసం సీఎం కేసీఆర్ రూ.550 కోట్ల నిధులను కేటాయించారు. అయితే... ఈ పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని, లబ్ధిదారులకు దక్కకుండా పక్కదారి పట్టాయని తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సర్కార్... దగ్గర్లో ఉన్న మీ సేవ లేదా ఈ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. 
 
దీంతో బాధితులు ఉదయం ఆరు గంటల నుంచే మీసేవా, ఈసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒక్కసారిగా ప్రజలు ఎగబడటంతో సర్వర్లు కూడా పనిచేయలేదు. ప్రజలు గుమిగూడటం, సర్వర్లు పనిచేయకపోవడం, ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉన్న నేపథ్యంలో వరద సాయాన్ని నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments