Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రకం మతాబులకు సుప్రీంకోర్టు పచ్చజెండా!!

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (19:00 IST)
తెలంగాణాలో టపాకాయల విక్రయం, వినియోగంపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. దీన్ని సవాల్ చేస్తూ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ అసోసియేషన్ తరపున అపెక్స్ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. గ్రీన్ కాకర్స్‌కు పచ్చజెండా ఊపింది. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో బాణాసంచా కొనుగోలు, అమ్మకాలపై ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రాకర్స్‌పై నిషేధం విధించడం వలన తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని, అలాంటప్పుడు తయారీకి ఎందుకు అనుమతులు ఇచ్చారని కోర్టుకు విన్నవించారు. 
 
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పండుగ పూట రెండు గంటల పాటు టపాకాయలు కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఎన్జీటీ తీర్పునకు లోబడే టపాకాయలు కాల్చాలని, హైకోర్టు ఆదేశాలు కూడా ఉండాలని సూచించింది. 
 
అంతకుముందు, నవంబర్ 9న బాణసంచా వినియోగంపై ఎన్జీటీ విచారణ జరిపింది. వాయుకాలుష్యం తీవ్రత ఎక్కువ ఉన్న నగరాలు, పట్టణాల్లో బాణసంచా పూర్తిగా నిషేధించాలని, గాలి నాణ్యత తక్కువ ఉన్న నగరాల్లో టపాసులు నిషేధం కొనసాగాలని స్పష్టంచేసింది. 
 
ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ, పటాన్‌చెరు, సంగారెడ్డిలో బాణాసంచాను నిషేధించాలని ఆదేశించింది. గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో గ్రీన్‌ క్రాకర్స్‌ను వినియోగించుకోవచ్చునని సూచించింది. 
 
దీపావళి రోజున కేవలం 2 గంటలు మాత్రమే పర్యావరణ హితమైన క్రాకర్స్ వాడాలని చెప్పింది. ఆ సమయాన్నితెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాలని తీర్పులో పేర్కొంది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

ముత్తయ్య ట్రైలర్ మనసును కదిలించిందంటున్న రాజమౌళి

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments