Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పోల్స్ : కూటమిలోనే కుమ్ములాట.. 11 స్థానాల్లో నువ్వానేనా

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (11:23 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలిసి మహాకూటమిగా ఏర్పాటయ్యాయి. ఈ కూటమి పార్టీలన్నీ కలిసి మొత్తం సీట్లను పంచుకుని పోటీ చేస్తున్నాయి. వాస్తవానికి ఆయా పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తమకు కేటాయించిన సీట్లలోనే ఆ పార్టీలు పోటీ చేయాల్సి ఉంది. కానీ, మహాకూటమిలో పరిస్థితిభిన్నంగా ఉంది. 11 స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు తలపడుతున్నారు. అభ్యర్థులకు ఆయా పార్టీలే బీ ఫారాలివ్వడం గమనార్హం. 
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 94 సీట్లు కేటాయించగా ఆ పార్టీ అభ్యర్థులు వంద సీట్లలో పోటీ చేస్తున్నారు. అలాగే, తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు కేటాయించగా 13 చోట్ల పోటీకి సిద్ధమయ్యారు. తెలంగాణ జన సమితి పార్టీకి 8 సీట్లు కేటాయించగా 14 చోట్ల, సీపీఐకు మూడు సీట్లు కేటాయించగా మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే, పలు స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆ వివరాలను పరిశీలిద్ధాం. 
 
1. వరంగల్ తూర్పు స్థానంలో రవి (కాంగ్రెస్), ఇన్నయ్య (తెజస)లు పోటీపడుతున్నారు. 
2. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇందిర (కాంగ్రెస్), చింతాస్వామి (తెజస)
3. దుబ్బాకలో నాగేశ్వర రెడ్డి (కాంగ్రెస్, రాజ్‌కుమార్ (తెజస)
4. మెదక్‌లో ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్), జనారసరెడ్డి (తెజస)
5. అంబర్‌పేటలో లక్ష్మణ్ యాదవ్ (కాంగ్రెస్), నిజ్జన రమేష్ (తెజస)
6. ఖానాపూర్‌లో రమేష్ రాథోడ్ (కాంగ్రెస్), తట్ర భీంరావు (తెజస)
7. అసిఫాబాద్‌లో అత్రం సక్కు (కాంగ్రెస్), కొట్నాక్ విజయ్ (తెజస)
8. చెన్నూరులో వెంకటేశ్ నేత (కాంగ్రెస్), దుర్గం నరేశ్ (తెజస)
9. మిర్యాలగూడలో కృష్ణయ్య (కాంగ్రెస్), విద్యాధర్ రెడ్డి (తెజస)
10. అశ్వారావుపేటలో మచ్చా నాగేశ్వర రావు (టీడీపీ), కడకం ప్రసాద్‌ (తెజస) 
11. మహబూబ్‌నగర్‌లో ఎర్ర శేఖర్ (టీడీపీ), రాజేందర్ రెడ్డి (తెజస). 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments