Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలనీలోకే బస్సు : తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (12:42 IST)
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. ఒకే ప్రాంతం, లేదంటే ఒకే కాలనీ నుంచి ఊర్లకు వెళ్లే ప్రయాణికులు 30 మంది, అంతకుమించి ఉంటే సమీపంలోని డిపో నుంచి బస్సును బుక్ చేసుకోచ్చు.
 
అలా బుక్ చేసుకునే బస్సులు నేరుగా కాలనీ లేదా ప్రాంతానికి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటుందని ఆర్టీసీ తెలిపింది. ఈ సదుపాయం బుధవారం నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు. 
 
అలాగే, దసరా పండుగను పురస్కరించుకుని నడిపే ప్రత్యేక బస్సులు, వాటి ధరలు, సమయం, ఇతర వివరాల కోసం ఆయా బస్ స్టేషన్లను సంప్రదించాలని సూచించారు. 
 
ఎంజీబీఎస్‌ను 99592 26257, జూబ్లీ బస్ స్టేషన్‌ను 99592 26264, రెతిఫైల్ బస్‌స్టేషన్‌ను 99592 26154, కోఠి బస్‌స్టేషన్‌ను 99592 26160 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. దసరా నేపథ్యంలో నగరం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments