Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. నిర్మల్‌లో ఆర్.ఎం.పి వైద్యుడి కిడ్నాప్

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (08:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు కిడ్నాప్‌‍కు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగా ఈ వైద్యుడిని కొందరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా సారంగాపూర్‌ గ్రామంలో దొంగల భయం పెరిగిపోయింది. దీంతో స్థానికులు నిత్యం గ్రామంలో రాత్రివేళ గస్తీ తిరుగుతున్నారు. మంగళవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో గ్రామం నుంచి ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. 
 
వాహనం నంబరు ప్లేట్లు కనపడకుండా ఉండటంతో గస్తీ తిరుగుతున్నవారికి అనుమానం వచ్చి ఆపారు. వివరాలు అడగ్గా డొంక తిరుగుడు సమాధానం చెప్పటంతో పాటు వారి వద్ద 9 ఎంఎం పిస్టల్‌ ఉండటంతో పోలీసులకు ఉప్పందించారు. వెంటనే పోలీసులు వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని సారంగాపూర్‌ ఠాణాకు తలించారు.
 
ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్‌పేటలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న రవికుమార్‌ను అపహరించి తీసుకెళ్తూ గ్రామస్థులకు పట్టుబడ్డారు. కిడ్నాపర్ల వద్ద తుపాకి, రెండు బుల్లెట్లు లభించాయి. 
 
అయితే.. ఆర్‌ఎంపీ రవికుమార్‌ సారంగాపూర్‌ మండలంలోని జౌళి గ్రామానికి చెందిన ఓ మహిళ వద్దకు వచ్చినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి మంగళవారం మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని కైలాస్‌టేకిడికి కారులో వెళ్తుండగా సదరు మహిళకు మరిదైన బానోతు మారుతి, మరో ఇద్దరు వ్యక్తులు బైకుపై వెంబడించి రవికుమార్‌ను అపహరించారు. రాత్రి సమయంలో అతన్ని తరలిస్తూ వంజర్‌ గ్రామస్థులకు దొరికిపోయినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments