Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ప్లీనరీలో తళుక్కుమన్న మంత్రి శ్రీనివాస్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (11:37 IST)
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న మున్నూరు ర‌వి తెరాస ప్లీనరీలో తళుక్కుమన్నాడు. పార్టీ వేడుక‌కు హాజ‌రై.. పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఫొటోలు దిగాడు. ఈ వ్య‌వ‌హారం పార్టీ ప్లీన‌రీలో క‌ల‌క‌లం రేపింది. 
 
పార్టీ ప్లీన‌రీకి హాజర‌య్యే నేత‌ల‌కు పార్టీ సెక్యూరిటీ, బార్ కోడ్‌ ఉన్న పాసుల‌ు జారీ చేసింది. పాసు ఉన్న వారే పార్టీ వేడుక‌కు హాజ‌రు కావాల‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణుల‌కు సూచించారు. 
 
మున్నూరు ర‌వికి ఈ పాస్ లేకున్నా అత‌డు పార్టీ ప్లీన‌రీకి ఎలా హాజ‌ర‌య్యాడ‌నే విష‌యంపై పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం పార్టీ ఐడీ కార్డుతో మున్నూరు ర‌వి పార్టీ వేడుక‌కు హాజ‌ర‌య్యాడ‌ని ఆ త‌ర్వాత తెలిసింది. 
 
పార్టీ వేడుక‌లో అధినేత కేసీఆర్ కీల‌క ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో కూడా మున్నూరు ర‌వి ఇంకా అక్క‌డే ఉన్నాడు. దీనిపై ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments