పాల్వంచలో విషాదం.. గ్యాస్ లీకై ముగ్గురి సజీవదహనం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (09:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన మంటల వల్ల ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ విషాదం పాత పాల్వంచ తూర్పు బజార్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు బజార్‌కు చెందిన శ్రీలక్ష్మి, మండిగ నాగ రామకృష్ణ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, సోమవారం వేకువజామున ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో దంపతులతోపాటు ఒక చిన్నారి సజీవదహనమైంది. మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 80 శాతం మేరకు శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి కూడా విషమంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments