పది జిల్లాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం పూర్తిగా తన రూపు రేఖలను మార్చుకోనుంది. ఈ రాష్ట్రంలోని జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 24 జిల్లాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఆ ప్రకారంగా కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలు.. వాటి కేంద్రాలు ఇవే..
హైదరాబాద్ జిల్లా: చార్మినార్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్
రంగారెడ్డి జిల్లా: వికారాబాద్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
వరంగల్ జిల్లా: వరంగల్, భూపాలపల్లి, జనగాం
మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు
ఆదిలాబాద్ జిల్లా: మంచిర్యాల, ఆదిలాబాద్
ఖమ్మం జిల్లా: కొత్తగూడెం, ఖమ్మం
నల్లగొండ జిల్లా: సూర్యాపేట, నల్లగొండ
మెదక్ జిల్లా: సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్
కరీంనగర్ జిల్లా: కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలు జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు కానున్నాయి. అయితే, నిజామాబాద్ జిల్లా మాత్రం నిజామాబాద్ గానే ఉంచుతున్నారు. అయితే, ఈ జిల్లాలోని కామారెడ్డి డివిజన్‌ను కొత్తగా ఏర్పడబోయే సిద్దిపేట జిల్లాలో కలుపుతారు.