సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న జవాన్ - ఐజీ చీఫ్ ఇంట్లో ఘటన

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (12:53 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఒక జవాను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా నివాసంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని దేవేందర్‌గా గుర్తించారు. ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దేవేందర్ కుమార్ గత 2021లో సీఆర్పీఎఫ్‌ జవానుగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని సీఆర్పీఎఫ్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా ఇంట్లో భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున చికోటి గార్డెన్ సమీపంలో దేవందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన సర్వీస్ రివాల్వ్‌తోనే కాల్చుకుని బలవన్మరానికి పాల్పడ్డాడు. 
 
అయితే, దేవేందర్ కుమార్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని బేగంపేట పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జవాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments