Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వేకు రూ.20 కోట్లు ఖర్చు.. కవిత స్థానికం కాదు.. అయినా...

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (10:23 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కోసం అక్షరాలా 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ సర్వేలో అనేక ప్రముఖులు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కె కవిత మాత్రం స్థానికం కాకపోయినప్పటికీ తన వివరాలను నమోదు చేసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
మంగళవారం చేపట్టిన ఈ సమగ్ర సర్వే గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెల్సిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించారని తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఒక్క రోజు సర్వేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను తన ఖజానా నుంచి విడుదల చేసింది.
 
మరోవైపు.. సమగ్ర సర్వేలో కొన్ని అంశాలు చర్చనీయాంశం కూడా అయ్యాయి. అలాంటి వాటిలో కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత వివరాల నమోదు కూడా ఒకటి. కవిత అత్తగారి ఊరు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్. ఈ ఊరిలో కవిత నివాసం ఉండటం లేదు. అయినప్పటికీ, కవిత వివరాలను ఆమె అత్తమామలు నమోదు చేయించారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్, విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments