Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (09:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి మూడు రోజలు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చి మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగివుందని వివరించింది. 
 
అలాగే, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తుమేరకు విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో బుధవారం నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 
 
ఇదిలావుంటే, వచ్చే 72 గంటల పాటు వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల అక్టోబరు 4వ తేదీ వరకు ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అధికారులు తెలిపారు. భారీ వర్షాల వల్ల బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా, అసన్‌సోల్‌తో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల దుర్గాపూజ మండపాలు వర్షంలో తడిసిపోవడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments