Webdunia - Bharat's app for daily news and videos

Install App

3,897 పోస్టులకు తెలంగాణ సర్కారు పచ్చజెండా

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (15:17 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 3897 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. వచ్చే యేడాది నుంచి ప్రారంభంకానున్న 9 బోధనా ఆస్పత్రుల కోసం ఈ పోస్టులను మంజూరు చేసింది. ఒక్కో బోధనా ఆస్పత్రికి 433 పోస్టుల చొప్పున కేటాయించి భర్తీ చేయనున్నారు. మొత్తంగా 3,897 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 
 
ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ పోస్టుల్లో ఆయా బోధనా ఆస్పత్రులతో పాటు వాటికి అనుబంధంగా ఏర్పాటు కానున్న ఆస్పత్రులకు సంబంధిచిన పోస్టులు కూడా ఉన్నాయి. 
 
ముఖ్యంగా, వికారాబాద్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ అసిఫాబాద్, జనగాం, నిర్మల్‌ జిల్లాల్లో కొత్తగా బోధనా ఆస్పత్రులను ప్రారంభించనున్నారు. వీటికి అవసరమైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ఇతరాత్రా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మజూరు చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం ఓ ట్వీట్ చేశారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments