Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాసాయిపేట పాపం రైల్వేశాఖదే : తెలంగాణ ప్రభుత్వం!

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (09:43 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట కాపలాలేని రైల్వేక్రాసింగ్‌ వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి రైల్వే శాఖదే పూర్తి బాధ్యత అని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోరం జరిగిందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మొహ్మద్ అలీలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. 
 
ప్రమాద సంఘటనపై రైల్వే శాఖ మంత్రి మాట్లాడిన తీరు సరైన విధానం కాదని హరీష్ రావు పేర్కొన్నారు. సౌత్‌సెంట్రల్‌ రైల్వేజోన్‌ జీఎం శ్రీవాస్తవ్‌ను మూడు రోజుల క్రితం గ్రామస్థులు కలిసి గేట్‌ ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ఆయన ఎంతమాత్రం స్పందించలేదని చెప్పారు. 
 
రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఇంత మంది చిన్నారుల ప్రాణాలను బలిగొందని నాయిని నర్సింహా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి రైల్వేక్రాసింగ్‌ వద్ద గేట్లు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సైతం ఖర్చు భరిస్తుందని హరీష్ రావు ప్రకటించారు. జరిగిన ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments