Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంద నుంచి తప్పిపోయిన మేక... కాపరిని తలకిందులుగా వేలాడదీసి పొగబెట్టారు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (10:58 IST)
మేకల మంద నుంచి ఒక మేక తప్పిపోయినందుకు తమ వద్ద పని చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాది తలకిందులుగా వేలాడదీశారు. అతని కింద పొగబెట్టారు. కేవలం మేకను ఎత్తుకుపోయాడనే అనుమానంతో అతడిని, అతడి స్నేహితుడిని ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతడి భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్ అంగడిబజార్ ప్రాంతంలో ఉంటున్నారు. వీరు పట్టణ శివారులోని గంగనీళ్ల పంపుల సమీపంలో షెడ్డు వేసి మేకలను పెంచుతున్నారు. తండ్రి లేకపోవడంతో తేజ (19) అనే యువకుడు వీరి ఇంట్లోనే ఉంటూ పశువుల కాపరిగా చేస్తున్నాడు. అతడి తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. 
 
ఈ క్రమంలో 20 రోజుల క్రితం మేకల మంద నుంచి ఒక మేకతో పాటు ఇనుప రాడ్డు కనిపించకుండా పోయింది. తేజతోపాటు అతడి దళిత స్నేహితుడు చిలుముల కిరణ్(30)పై యజమాని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆ ఇద్దరినీ శుక్రవారం షెడ్డుకు పిలిపించింది. ఆ తర్వాత వారిని కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి తలకిందులుగా వేలాడదీశారు. ఆపై తల కింద నేలపై నిప్పు పెట్టి చిత్ర హింసలకు గురిచేశారు. పొగతో ఊపిరాడక వారు నానా యాతన అనుభవించారు. ఆ తర్వాత వారిద్దరినీ విడిచిపెట్టారు.
 
రామగుండానికి చెందిన కిరణ్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో మందమర్రిలో తన చిన్నమ్మ సరిత వద్ద ఉంటూ నిర్మాణ కార్మికుడిగా పొట్టపోసుకుంటున్నాడు. శుక్రవారం బయటకు వెళ్లిన కిరణ్ ఎంతకీ రాకపోవడంతో సరిత తీవ్ర ఆందోళనకు లోనైంది. ఇదేసమయంలో, అతడిని చిత్రహింసలకు గురి చేసిన ఫొటోలను చూసి భయపడిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు రాములు, ఇతర కుటుంబసభ్యులపై అట్రాసిటీ కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments