Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ 'డ్రగ్' సెలబ్రిటీలకు గ్రేట్ రిలీఫ్... వాళ్లు బాధితులేనన్న కేసీఆర్

ఇప్పటివరకూ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన టాలీవుడ్ నటీనటులు డ్రగ్స్ కేసుల్లో అరెస్టు అవుతామేమోనన్న ఆందోళలో వున్నట్లు తెలిసిందే. ఐతే వాళ్లందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద రిలీఫ్ ఇచ్చే మాట చెప్పారు. నోటీసులు అందుకున్న సినీ ఇండస్ట్రీ ప్రముఖులు బ

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (19:23 IST)
ఇప్పటివరకూ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన టాలీవుడ్ నటీనటులు డ్రగ్స్ కేసుల్లో అరెస్టు అవుతామేమోనన్న ఆందోళలో వున్నట్లు తెలిసిందే. ఐతే వాళ్లందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద రిలీఫ్ ఇచ్చే మాట చెప్పారు. నోటీసులు అందుకున్న సినీ ఇండస్ట్రీ ప్రముఖులు బాధితులే తప్ప నేరస్తులు కారని స్పష్టీకరించారు. డ్రగ్స్ వాడటాన్ని తాము నేరంగా పరిగణించడం లేదనీ, డ్రగ్స్ అమ్మకందార్లు, సరఫరా చేసేవారు, ఇతరులకు అలవాటు చేస్తున్నవారిపై ఖచ్చితంగా కఠిన చర్యలుంటాయన్నారు. 
 
ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమను లక్ష్యం చేసుకున్నామన్న ఆరోపణల్లోవాస్తవం లేదని చెప్పిన ఆయన డ్రగ్స్ తీసుకోవడం నేరం కాదన్నారు. దేశంలోనే తెలంగాణ డ్రగ్స్ విషయంలో అగ్రస్థానంలో వున్నదన్న మాటలో నిజం లేదనీ, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో చెప్పుకునే స్థాయిలో కూడా లేదన్నారు. 
 
ఇప్పుడిప్పుడే ఇక్కడ డ్రగ్స్ దందా వెలుగుచూడటంతో దానిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలియజేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సీఐడికి అప్పగించాలన్న యోచనలో ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసుకు సంబంధించి రెండో జాబితా రెడీ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎవరి పేర్లు వుంటాయన్న ఆసక్తి నెలకొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments