Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా అబద్ధాలకోరు... నల్లగొండలో పాములాట పెడితే ఊర్కుంటమా... కేసీఆర్ ఫైర్

తెలంగాణలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా చెపుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. తనను విమర్శిస్తే ఒప్పుకుంటాను కానీ తెలంగాణను అవమానించేవిధంగా మాట్ల

Webdunia
బుధవారం, 24 మే 2017 (17:35 IST)
తెలంగాణలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా చెపుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. తనను విమర్శిస్తే ఒప్పుకుంటాను కానీ తెలంగాణను అవమానించేవిధంగా మాట్లాడితే మాత్రం ప్రాణం పోయినా సహించేది లేదని అన్నారు.
 
ఆయన మాటల్లోనే... " అభివృద్ధి విషయంలో ప్రపంచంతోనే పోటీ పడుతున్నాం. కేంద్రం తెలంగాణకు ఇచ్చే డబ్బెంతో అమిత్ షా తెలుసుకోవాలి. దేశాన్ని పెంచి పోషించే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా వుంది. నిధులను అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లే తెలంగాణకు ఇస్తుంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు డబ్బిస్తే... తెలంగాణకు ఒక్కసారి ఇచ్చారు. రూ. 11,600 కోట్లు ఇంకా రావాల్సి వుంది. అసలు ఇప్పటివరకూ ఇచ్చిందే 60 వేల కోట్లు అయితే లక్ష కోట్లు ఇచ్చామంటున్నారు. అదేమీ భాజపా ఇచ్చింది కాదు... కేంద్రం ఇచ్చింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ఇవ్వాల్సిందే.
 
భాజపా జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా అలా మాట్లాడకూడదు. కేంద్రం ఎంత డబ్బిచ్చిందో తెలుసుకుని ఆయన మాట్లాడాలి. నల్లగొండకు వచ్చి పాములాటలు పెడితే ఊర్కుంటమా. అమిత్ షా వంటి షాలను చాలామందిని చూసినం. ఇక్కడ బీజేపీ స్థాయి ఏమిటో తెలుసు" అంటూ చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments